Share News

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:17 AM

దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం
గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు

జలుమూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కనుమ పండగా పర్వదినం పురస్కరించుకొని దేవదాయశాఖ అధికారులు, అర్చకులు ధర్మకర్త పర్లాకిమిడి రాజు గారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో ఏడుకొండలు ఆధ్వర్యంలో గర్భగుడిలో గల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను బయటకు తెచ్చి నూతన వస్త్రాలు ధరించి పూలమాలలుతో అలంకరించి నందివాహనంపై ఆసీనులను చేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కాగడా దీపాలు వెలుగుతో గ్రామోత్సవం నిర్వహించారు. సంప్రదాయబద్దంగా శ్రీముఖలింగానికి రెండు కిలోమీటర్లు దూరంలో గల నగిరికటకం వరకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు, అర్చకులు ఎస్‌వీ చలం, శ్రీకృష్ణ, అప్పారావు, యోగి, శివ, అచ్యుత, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:18 AM