ప్రభుత్వ ధాన్యం స్వాహా.. మిల్లర్‌కు మూడేళ్ల జైలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:52 AM
ప్రభుత్వాని చెందిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఓ రైస్‌మిల్లు యజమానికి పలాస కోర్టు జైలు శిక్ష విధిస్తూ సోమవరం కీలక తీర్పునిచ్చింది.
రూ.3కోట్ల విలువైన బియ్యం ఎగవేత కేసులో శిక్ష ఖరారు
పలాస/రూరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాని చెందిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఓ రైస్‌మిల్లు యజమానికి పలాస కోర్టు జైలు శిక్ష విధిస్తూ సోమవరం కీలక తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాస మండలం మొగిలిపాడులో ము రళీకృష్ణ రైస్‌మిల్లు నిర్వహిస్తున్న ఎస్.మురళీకృష్ణకు 2014-15 సీజన్‌కు సం బంధించి రబీ, ఖరీప్‌లో పలాస, వజ్రపుకొత్తూరు, బ్రాహ్మణతర్లా పీఏసీఎస్‌ల పరిధిలోని 4,753 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అధికారులు మిల్లింగ్ కో సం అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రభు త్వానికి బియ్యం రూపంలో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే మిల్లు యజమాని మురళీకృష్ణ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా సుమారు రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సొంతానికి వాడుకొని మోసానికి పాల్పడ్డారు. దీనిపై అప్పటి శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఫిర్యాదు మేరకు 2016 జూన్ 16న కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారించిన పలాస కోర్టు న్యాయాధికారి మాధురి, ప్రాసిక్యూషన్ తరుఫున ఏపీపీ రమేష్ వినిపించిన వాదనలతో ఏకీభవించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత నేరం రుజువు కావడంతో నిందితుడు మురళీకృష్ణకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, మరో సెక్షన్ కింద రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ రెండు శిక్షలను ఏక కాలంలో అనుభవించాలని ఆదేశాలు జారీచేశారు. కాగా మరో సెక్షన్ కింద నమోదైన కేసులో నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించారు.
పోలాకి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి పట్ల టంకాల శాంతారావు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన నేరం రుజువుకావడంతో నరసన్నపేట కోర్టు న్యాయాధికారి ఎస్.వాణి సోమవారం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పినట్టు ఎస్.జి.రంజిత్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. 2023లో నమోదైన ఈ కేసులో వాదోపవాదనలు పూర్తియిన తర్వాత నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ20వేలు జరిమానా విధించారు. కేసును గత నరసన్నపేట ఎస్‌ఐ సత్యనారాయణ నమోదు చేశారని, ఏపీపీ రొక్కం శాంతిసంతోషి వాదనలు వినిపించారు.