ప్రజాసేవకే ప్రభుత్వ ప్రాధాన్యం:ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:48 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచార ఆర్భాటాలకు స్వస్తిపలికి... ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకే ప్రాఽధాన్యమిస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
పలాసరూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచార ఆర్భాటాలకు స్వస్తిపలికి... ప్రజా సంక్షేమానికి, ప్రజాసేవకే ప్రాఽధాన్యమిస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం వీరఽభద్రాపురం గ్రామంలో గురువారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసుపుస్తకాల మీద నాయకుల ఫోటోలు ఉండే వని.. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికార ముద్రతో మాత్రమే అందజేస్తోందని తెలిపారు. భూమి రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని... వాటిని వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవడం సరైన విషయం కాదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వాడ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ వంకల కూర్మారావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, అవుగాన దశరథ, తహసీల్దార్ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటున్నాం
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైతులను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఉద్దానం మెళియాపుట్టిలో గురువారం కొత్త పాసు పుస్తకాలను తహసీల్దార్ డీవీ సీతారామయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. సమా వేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు, ఎంపీ డీవో రమేష్ నాయు డు, డీటీ శ్రావ ణ్‌కుమార్ ఉన్నారు. చిన డోకుల పాడు గ్రామానికి చెందిన యలమంచి తిరుప తిరావుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ..39,800 చెక్కును ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం అందించారు.
అర్హులందరికీ పక్కా గృహాలు
పలాస, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పక్కా గృహాలు అందించే ందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో హౌసింగ్ పీడీ డి.రమాకాంతరావు, డీఈఈలు వి.నర్సింగరావు, వి.వెంకటసత్యాజి, వై.శ్రీనివాసరావులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో గృహ నిర్మాణ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే నిధులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరే విధంగా చొరవ తీసుకోవాలని... వారు గృహ నిర్మాణాలు తొందరగా చేపట్టడానికి మార్గర్శకాలు ఇవ్వాలన్నారు.