Share News

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:01 AM

జిల్లాలో క్రీడా భివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని శ్రీకాకుళం ఎ మ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. నగరంలోని శాంతినగర్‌ కాలనీ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం సన్‌రైజ్‌ నారా యణశెట్టి వెంకట శ్రీనివాసులు మెమోరియల్‌ రాష్ట్ర సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలన ఆమదాల వలస, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, నడుకుదిటి ఈశ్వరరావుతో కలిసి పోటీలను ప్రారంభించారు.

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, కూన రవికుమార్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడా భివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని శ్రీకాకుళం ఎ మ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. నగరంలోని శాంతినగర్‌ కాలనీ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం సన్‌రైజ్‌ నారా యణశెట్టి వెంకట శ్రీనివాసులు మెమోరియల్‌ రాష్ట్ర సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలన ఆమదాల వలస, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, నడుకుదిటి ఈశ్వరరావుతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రెండు నెలల వ్యవధిలో సరికొత్త ఇండోర్‌ స్టేడి యం అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.14 కోట్లతో పాత్రునివలస, కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నా యన్నారు. భవిష్యత్‌లో జాతీయ పోటీలకు ఆతిథ్యమిచ్చేలా, 500 మంది బస చేసేలా డార్మిటరీలు, ఇతర వసతులు కల్పిస్తున్నా మన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధృడ త్వంతో పాటు క్రమ శిక్షణ, నాయకత్వ లక్షణా లను పెంపొందిస్తాయన్నారు. క్రీడాకారులు జాతీ యస్థాయిలో పాల్గొని రాష్ట్రానికి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌. ఈశ్వరరావు మాట్లాడుతూ .. జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినం దనీయమని, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధు లు సాగర్‌, ఎంఎంవిలేఖర్‌, ఎన్‌వీ.కిరణ్‌కుమార్‌, జి.సోమేశ్వరరావు, ఎం.అశోక్‌ కుమార్‌, సీఈవో ఎస్‌.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:01 AM