ఓటుతో ప్రభుత్వాలను మార్చవచ్చు
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:49 PM
ఓటు వజ్రాయుధం వంటిదని, దీనితో ప్రభుత్వాలను మార్చవచ్చని తహసీల్దార్ జె.రామారావు తెలిపారు. సోమవారం జలుమూరులో ఓటు హక్కుపై అవగాహన కల్సిస్తూ ర్యాలీతోపాటు మానవహారం చేపట్టారు.
జలుమూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఓటు వజ్రాయుధం వంటిదని, దీనితో ప్రభుత్వాలను మార్చవచ్చని తహసీల్దార్ జె.రామారావు తెలిపారు. సోమవారం జలుమూరులో ఓటు హక్కుపై అవగాహన కల్సిస్తూ ర్యాలీతోపాటు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుతో ప్రజాస్వామ్యం మరింత బలపడుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, ఎంఈవోలు బి.మాధవరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.