నిరుపేదలకు ప్రభుత్వం ఆసరా
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:14 AM
ఆపదలో ఉన్న ప్రతి నిరుపేదకూ కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, అక్టోబరు 10(ఆంధ్ర జ్యోతి): ఆపదలో ఉన్న ప్రతి నిరుపేదకూ కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రూ.1.01 లక్షల విలువచేసే సీ.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులకు సంబంధిత వ్యక్తులకు శనివారం అందజేశారు. మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన సవళాపురం వెంకటరావుకు రూ.75,315, ఉర్లాన ప్రవీణ్ కుమార్‌కు రూ.25,795 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాఽ దితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే గోవిందరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నేతలు, గ్రామస్థులు పాల్గొ న్నారు.