డయేరియా బాధితులకు ప్రభుత్వ అండ
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:09 AM
నగరంలోని డయేరియా బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.
అరసవల్లి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): నగరంలోని డయేరియా బాధి తులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మె ల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. డయేరియా ప్రబలిన విషయం తెలుసుకుని మంగళవారం అమరావతి నుంచి నేరుగా శ్రీకాకుళంలోని కిమ్స్, రిమ్స్ ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఎటువంటి భయాందోళన చెందవద్దని భరోసా కల్పించారు. అనంతరం డయేరియాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి అందజేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో మాట్లాడారని, జిల్లా అధికారులతో వర్చువల్ సమావేశంలో మాట్లాడి పరిస్థితిని సమీక్షించి తగు ఆదేశాలిచ్చారన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.