పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు : అశోక్
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:56 PM
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు.
కవిటి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు. కవిటిలో మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్.రామకృష్ణ, హెచ్‌ఎం ఎన్.విశ్వనాథం, టీడీపీ నేతలు ఎ.మధు, బి.రమేష్, ఎ.త్రివిక్రమరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బడిమీది.. భరోసా మాది: రవికుమార్
సరుబుజ్జిలి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశా లలో విద్యార్థులను చేర్చాలని, నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్‌కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. మంగళవారం ఎంఈవోలు బాలరాజు, శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో రొట్టవలస జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అలాగే ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి టెన్త్ ప్లస్ విద్యార్థినులను అభినందించారు. ప్రతిభ కలిగిన ఉపాఽధ్యాయులతో విద్యా బోధన చేస్తు న్నారని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడులను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారా యణ, టీడీపీ నాయకులు ఎ.రాంబాబు, కె. సిద్దార్ధ, టి.సురేం ద్ర, జనసేన నేత మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోలేరు ప్రభుత్వ బడిలో 48 మంది చేరిక
కంచిలి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): పోలేరు ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులను చేర్పించినట్లు ఎంఈవో ఎస్.శివరాంప్రసాద్ తెలిపారు. మంగళవారం గ్రామంలోని ఇంటింటికీ ఉపాధ్యాయులతో కలిసి వెళ్లి విద్యార్థుల తల్లిదం డ్రులను కలిసి అవగాహన కలిగించారు. గతంలో ఈ పాఠశాలలో పది మంది విద్యార్థులు ఉండేవారని, ఏడుగురు ఆరో తరగతికి వెళ్లిపోవడంతో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. దీంతో పాఠశాల మూసివేసే పరిస్థితి వచ్చింది. పాఠశాల పరిస్థితిని ఉపాధ్యాయుడు జనార్దనరావు స్థానిక పెద్దలతో చర్చించి ఎస్‌ఎంసీ కమిటీ సభ్యుల సహకారంతో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో గ్రామమంతా తీర్మానం చేసి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని ఎంఈవో తెలిపారు.