Share News

యువతకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:04 AM

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

యువతకు అండగా ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

  • జాబ్‌మేళాలో 106 మంది ఎంపిక

నరసన్నపేట, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన విధానాలతో నేడు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. డిగ్రీ స్థాయి నుంచి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈమేళాలో 227 మంది పాల్గొనగా.. 106 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పొందర కురాకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర నర్సింహులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.లత, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్‌, కళింగ కోమటి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జామి వెంకట్రావు, సాసుపల్లి కృష్ణబాబు, గొద్దు చిట్టిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:04 AM