‘నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం’
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:31 AM
నిరుద్యోగులకు బాసటగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు.
నరసన్నపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు బాసటగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ థాంక్యూ సీఎం, థాంక్యూ లోకేష్ అంటూ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువగళంలో నారా లోకేష్ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష, తెలుగు యువత నియోజవర్గ అధ్యక్షుడు రావాడ గణపతిరావు, కురాకుల, పొందర కార్పొరేషన్ చైర్మన్ దామోదరం నర్సింహులు, కళింగ కోమట్ల కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు అడపా చంద్రశేఖర్, సాసుపల్లి కృష్ణబాబు, శిమ్మ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘జాబ్ క్యాలెండర్‌తో యువతకు ఉద్యోగాలు’
కోటబొమ్మాళి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు ఉద్యోగాల అవకాశం కల్పించిందని కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవింరాజులు అన్నా రు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో ఒకవైపు పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షిస్తూ, మరో వైపు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.