‘ఆఫ్‌షోర్ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం’
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:58 PM
రేగులపా డు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయరు ని ర్వాసితులకు న్యా యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్‌రావు అన్నారు.
పలాస రూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రేగులపా డు వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయరు ని ర్వాసితులకు న్యా యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్‌రావు అన్నారు. పలాస తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేగులపాడు గ్రామానికి చెందిన ఆఫ్‌షోర్ నిర్వాసి తులైన 58మంది బాధితులకు రూ.58 లక్షల మేర చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గౌతు శిరీష, వ్యవసాయశాఖ మం త్రి అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా బాధితుల బకాయిలను చెల్లించామని, ఆఫ్‌షోర్ పనులు శరవేగంగా ప్రస్తుతం జరుగుతుందన్నారు. 2027 నాటికి రిజర్వాయరులో నీరు ఉండేలా పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ కల్యాణచక్రవర్తి, ఈఈ శేఖర్, ఏఎంసీ చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు దువ్వాడ సంతోష్, అవుగాన దశరథరావు, నిర్వాసితులు పాల్గొన్నారు.