Share News

ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:06 AM

పార్టీలకతీతంగా ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం సేవలు అందించడం అధికార కార్యాలయం ముఖ్య ఉద్దేశ్యమని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పార్టీలకతీతంగా ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం సేవలు అందించడం అధికార కార్యాలయం ముఖ్య ఉద్దేశ్యమని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. విజన్‌-2047 లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధికార కార్యాలయాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పారి శ్రామికవాడ ప్రాంతంలోగల ఏపీఐఐసీ భవనంలో గురువారం ఎమ్మెల్యే రవికుమార్‌ పూజలు నిర్వహించి అధికార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఎమ్మెల్యే అధికార కార్యాలయంలో ఐదుగురు ప్రభుత్వోద్యోగులు విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధి విధానాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా నిలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, టీడీపీ నాయకు లు తమ్మినేని చంద్రశేఖర్‌, నూకరాజు, సనపల ఢిల్లీశ్వరరావు, సిమ్మ మాధవి, రెడ్డి గౌరి, నాగళ్ల మురళీధర్‌యాదవ్‌, ఎస్‌.మురళీధర్‌, కె.ఆంజనేయులు, మునిసిపల్‌ కమిషనర్‌ రవి పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:07 AM