ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:51 PM
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన రెండేళ్లలే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన రెండేళ్లలే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వీఎన్‌పురం గ్రామంలో పర్య టించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, కలిశెట్టి రామారావు, మండపాక కనకారావు, పిషిని జగన్నాథంనాయుడు, దుమ్ము అశోక్, ముక్కు ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.