Share News

సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:46 PM

విద్యార్థులకు మౌలికవసతుల కల్పన, సం క్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు తెలిపారు.

సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
పాతపట్నం: విద్యార్థినికి సామగ్రి అందజేస్తున్న ఎమ్మెల్యే ఎంజీఆర్‌

పాతపట్నం, జూలై 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మౌలికవసతుల కల్పన, సం క్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినులకు సోషల్‌ వెల్ఫేర్‌శాఖ సరఫరా చేసిన బెడ్‌షీట్లు, దుప్పట్లు, స్పోర్స్‌ డ్రెస్సులు, స్పోర్ట్స్‌ షూస్‌, స్వెట్టర్లు, ప్లేట్లు, గ్లాసులతో కూడిన సామగ్రిని అందజేశారు.

ఫమెళియాపుట్టి (కొత్తూరు), జూలై 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం కొత్తూరు మండలంలోని పొన్నూటూరు పాఠశాలకు రామరాజు ట్రస్టు అధ్యక్షుడు పి.రామరాజు 25 వేలు విరాళం చెక్కు ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.

Updated Date - Jul 19 , 2026 | 11:46 PM