Share News

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:03 AM

కూటమి ప్రభుత్వం వచ్చిన విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
అదనపు గదులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

  • పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

మెళియాపుట్టి (కొత్తూరు), ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీలో రూ.2.12 కోట్లతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో నిధులు మంజూరు చే సినా.. ఎక్కడా పనులు పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. పాఠశాలల గోడ లకు రంగులు వేసి ప్రచారం చేసుకున్నారే తప్పా కొత్త నిర్మాణాలు ఎక్కడా చేపట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ శాలల్లో మౌలిక సౌకర్యలు కల్పించడంతోపాటు కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా బోధన జరుగుతుందన్నారు. అధికంగా వసతి గృహాలు పెంచడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మాతల గాంధీ, టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరావు, టీడీపీ నాయకులు తులసీబాబు, కోటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:03 AM