Share News

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:40 PM

విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం జలుమూరు కేజీబీవీ పాఠశాలలో 2.12 కోట్లు రూపాయలతో నిర్మించిన అదనపు వసతులు భవనాన్ని ప్రారంభించారు.

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
మాట్లాడుతున్న బగ్గు రమణమూర్తి:

జలుమూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం జలుమూరు కేజీబీవీ పాఠశాలలో 2.12 కోట్లు రూపాయలతో నిర్మించిన అదనపు వసతులు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఈఈ డీవీఎస్‌ఎన్‌మూర్తి, డీఈ ఉమామహేశ్వరి, ఎంఈవోలు బి.మాధవరావు, ప్రసాదరావు, టీడీపీ మండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, టీడీపీ నాయకులు ముద్దాడ శ్రీనివాసరావు, దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు, కింజరాపు సత్యం, తర్ర బలరాం, మునుకోటి దాము, గురుబెల్లి ఝాన్సీ, పాల్గొన్నారు.

ఫజలుమూరు, (సారవకోట) ఏప్రిల్‌ 6: (ఆంధ్రజ్యోతి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సారవకోటలో 1.75 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్‌ కార్యాలయ భవనానికి సోమవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో మురళీమోహన కుమార్‌, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, సారవకోట సొసైటీ అధ్యక్షుడు సురవరపు తిరుపతిరావు, టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, రత్నాలు నాయుడు, పట్ట ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:40 PM