క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:58 PM
క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అంతర్ జిల్లాల సీనియర్ పురుషులు, మహిళల టెన్ని కాయిట్ ఛాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ కార్య క్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శిరీష మాట్లాడుతూ నియోజకవర్గంలో మినీ, ఇండోర్ స్టేడియంలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. జాతీయ పోటీలకు పురుషుల విభాగంలో వి.వినయ్ కుమార్, పీజేఎండీ రామారావు, ఎస్.రాహుల్, బి.సిద్ధార్థ, బి.సత్యనారాయణ, కె.చంద్రమౌళి ఎంపికయ్యారు. మహిళల విభాగంలో జి.హేమమాధురి, ఆర్.మౌనిక, రేణుక, జి.శ్రావణి, ఎస్.దివ్య, ఎం.ప్రియదర్శిని ఎంపికయ్యారు. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా నిర్వహణ కార్యదర్శి పి.తవిటయ్య, రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేఎన్‌వి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, మల్లా సంతోష్‌కుమార్, గాలి కృష్ణారావు, దడియాల నర్సింహులు, సప్ప నవీన్, అథ్లెటిక్ టెక్నికల్ కమిటీ చైర్మన్ కె.హరిబాబు, పీఈటీలు ఎస్.రామారావు, సిహెచ్.పద్మలోచన, చంద్రశేఖర్, కె.రామారావు, పి.సునీత పాల్గొన్నారు.
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పురుషోత్తపురం కాలనీ ఎర్ర చెరువు గట్టు వద్ద రూ.25 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎర్రచెరువు గట్టు నుంచి పారిశ్రామికవాడ వరకూ పక్కా రహదారి, చెరువు చుట్టూ అభివృద్ధికి రూ.3 కోట్లతో శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.