టెక్కలి వైద్యుడిపై ప్రభుత్వం కొరడా!
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:41 AM
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జి సురేష్ కుమార్ (సీఎస్‌ఎస్ డీఎం)పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెండేళ్లకు పైగా విధులకు డుమ్మా..
శ్రీకాకుళం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జి సురేష్ కుమార్ (సీఎస్‌ఎస్ డీఎం)పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా సుదర్ఘీ కాలం విధులకు గైర్హాజరైనందుకుగాను ఏపీ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్ కింద ఈ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమా శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం జీవో ఆర్టీ నెంబర్ 327ను విడుదల చేశారు. డాక్టర్ జి.సురేష్ కుమార్ టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తూ, ఏప్రిల్ 18, 2023 నుంచి ఆగస్టు 28, 2025 వరకు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. తిరి గి 2025 ఆగస్టు 29న పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆయన రిపోర్ట్ చేశారు. అనధికారిక గైర్హాజరు కారణంగా ఆసుపత్రి పరిపాల నకు, రోగుల సంరక్షణకు తీవ్ర అసౌకర్యం ఏర్పడిందని ప్రభు త్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్‌లో పేర్కొంది. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, విధి నిర్వహణ పట్ల అంకితభావం ఆయనలో లోపించాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు అందిన పది రోజుల్లోగా డాక్టర్ సురేష్‌కుమార్ వివరణను (స్టేట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్) సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.