నదీ సమీపంలో ప్రభుత్వ భవనాలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:27 AM
నిబంధనలను తుంగ లోకి తొక్కి లక్షలాది రూపాయలు ప్రజా ధనాన్ని వృథా చేసిన ఇద్దరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.
నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం
ఏఈ పోలినాయుడు, రిటైర్డ్ డిప్యూటీ ఈఈ ధర్మారావుపై విచారణ
ఆమదాలవలస, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నిబంధనలను తుంగ లోకి తొక్కి లక్షలాది రూపాయలు ప్రజా ధనాన్ని వృథా చేసిన ఇద్దరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఆమదాలవలస మండలంలో నదికి సమీపంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల నిర్మా ణాలు చేపట్టడంపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ.. పీఆర్‌అండ్ ఆర్‌డీ(విజిలెన్స్)శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు ఆ వివరాలిలా ఉన్నాయి.. కలివరం, నిమ్మతొర్లోడ గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు, విలేజ్‌హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టారు. కలివరంలో ఆర్బీకే, విలేజ్‌హెల్త్ సెంటర్, నిమ్మతొర్లోడలో గ్రామసచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ సెంటర్ల ను నదీ సరిహద్దు నుంచి 50 మీటర్ల లోపే నిర్మాణం చేపట్టడంతో గతం లో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తు చేపట్టి రూ.22,47,098 మేర ప్రభుత్వ ధనం వృఽథా అయిందని విజిలెన్స్ విచారణలో నిర్ధారించి ఈ ఏడాది మార్చి 3న ప్రభుత్వానికి నివేదిక అం దించింది. వీటికి బాధ్యులుగా ఆమదాలవలస మండల ఇంజనీరింగ్ అధికారి, ప్రస్తుత శ్రీకాకుళం పీఐయూ సబ్ డివిజన్‌లో ఏఈగా పనిచేస్తు న్న ఎం.పోలినాయుడు, అప్పటి ఆమదాలవలస పీఆర్ సబ్ డివిజన్ డీఈ ఈగా పనిచేసి 2024 మార్చి 31న పదవీ విరమణ పొందిన పి.ధర్మారావు పై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేర కు పీఆర్‌అండ్‌ఆర్డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే రెండు వేర్వేలు ఉత్తర్వులు జారీ చేశారు. మెమో అందిన 10 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణను సమర్పించాలని వారిని ఆదేశిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.