Share News

గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:55 PM

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీ యమని వక్తలు కొనియాడారు. ఆదివారం గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

   గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం
నరసన్నపేట:లచ్చన్న చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీ యమని వక్తలు కొనియాడారు. ఆదివారం గౌతు లచ్చన్న జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫకోటబొమ్మాళి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం సర్ధార్‌ గౌతు లచ్చన్న చేసిన కృతి మరువలేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈమేరకు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించినట్లు మంత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలచేశారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు.

ఫనరసన్నపేట, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సర్ధార్‌ గౌతు లచ్చన్న ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. స్థానిక ఎంపీడీవో సమావేశపు మందిరంలో గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, తోటమోహనచంద్రమోహన్‌ దేవ్‌, సరియపల్లి ముధు, బి.సంతోషి, సంఘనాయకులు దంత శ్రీనివాసరావు, బొంతల సింహాచలం, వి. దాలిరాజు పాల్గొన్నారు.

ఫశ్రీకాకుళం క్రైం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఎస్పీ పి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింగరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:55 PM