Share News

‘ఒడియా భాషాభివృద్ధికి గోపబంధు విశేష కృషి’

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:56 PM

ఒడియా భాషాభి వృద్ధికి గోపబంధు దాస్‌ విశేష కృషి చేశారని అపోటా సంఘ సభ్యులు పేర్కొన్నారు.

‘ఒడియా భాషాభివృద్ధికి గోపబంధు విశేష కృషి’
గోపబంధుదాస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న అపోటా నాయకులు

కంచిలి, మార్చి 11 (ఆంఽధ్రజ్యోతి): ఒడియా భాషాభి వృద్ధికి గోపబంధు దాస్‌ విశేష కృషి చేశారని అపోటా సంఘ సభ్యులు పేర్కొన్నారు. ప్రాచీన ఒడియా భాషా దినోత్సవాన్ని ఎంఎస్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవర ణలో ఉన్న గోపబంధు దాస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఒడియా ఉపాధ్యాయ సంఘం (అపోటా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్‌ దొళాయి, హెచ్‌ఎం కిశోర్‌ ఖడంగా, ప్రమోద్‌కుమార్‌, అశోక్‌ ప్రధాన్‌, రమేష్‌ దొర, ప్రతాప్‌కుమార్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

జాతి మనుగడకు భాషను కాపాడుకోవాలి

కవిటి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జాతి మనుగడకు భాషను కాపాడుకోవాలని ఒరియా ఉన్నత పాఠశాల ఇన్‌ చార్జి హెచ్‌ఎం శివరామ్‌ బెహరా అన్నారు. సహలాల పుట్టుగ, పెద్ద ఎర్రగోవిందపుట్టుగ పాఠశాలల్లో బుధవారం ఒరియా భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం ఒరియాను 2014 మార్చి 11న శాస్త్రీయ భాషగా గుర్తించడంతో ఆ రోజును ఒరియా భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఒరియా భాషాభివృద్ధికి ఉపేంద్ర భజన, గోపబంధు దాస్‌ తదితర కవులు విశేష కృషి చేశార న్నారు. అనంతరం విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు.

Updated Date - Mar 11 , 2026 | 11:56 PM