పట్టాలు తప్పిన గూడ్స్
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:54 PM
Severe disruption to train services మందస రోడ్ రైల్వేస్టేషన్ (హరిపురం) సమీపంలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గూడ్స్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో లోకోపైలెట్ అప్రమత్తమై పరిశీలించగా రెండు బోగీలు పట్టాలు తప్పినట్టు గుర్తించి.. నిలిపేశాడు.
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
మందస రోడ్ వద్ద ఘటన
హరిపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మందస రోడ్ రైల్వేస్టేషన్ (హరిపురం) సమీపంలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గూడ్స్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో లోకోపైలెట్ అప్రమత్తమై పరిశీలించగా రెండు బోగీలు పట్టాలు తప్పినట్టు గుర్తించి.. నిలిపేశాడు. బోగీల చక్రాలు తెగి ట్రాక్‌పై పడ్డాయి. కాగా అదే సమయంలో ఎదురుగా విశాఖ నుంచి భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. ఒకవేళ బోగీలు బోల్తాపడితే పెను ప్రమాదం సంభవించేది. ముప్పు తప్పడంతో స్థానికులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాక్ సాంకేతిక బృందం పలాస నుంచి వచ్చి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించారు. దీంతో సుమారు రెండు గంటలపాటు పలు రైళ్లు ఆయా స్టేషన్ల వద్ద నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే అధికారులు సమస్యను గుర్తించి కేవలం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒకే ట్రాక్‌లో నడిపించి ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పించారు. సాయంత్రానికి ట్రాక్ పూర్తి మరమ్మత్తులు చేపట్టి ప్రత్యేక పర్యవేక్షణతో రైళ్లు రాకపోకలు చేపట్టారు.