డిపోలకు సకాలంలో సరుకులు చేరాలి: జేసీ
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:02 AM
మండ లంలోని రేషన్ డిపో లకు సకాలంలో సరు కులను చేరేలా చర్య లు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశించారు.
గార, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని రేషన్ డిపో లకు సకాలంలో సరు కులను చేరేలా చర్య లు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రామచంద్రా పురంలో నూతనంగా ప్రారంభించిన ఎంఎల్‌ఎస్ గోడౌన్‌ను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అనువుగా గోడౌన్‌కు వెళ్లే రోడ్డును మెరుగు పర్చాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం శ్రీని వాసరావు, తహసీల్దార్ ఎం.చక్రవర్తి, డీటీ చంద్రమౌళి పాల్గొన్నారు.
రెవెన్యూ క్వార్టర్ల నిర్మాణానికి భూమిపూజ
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని అఫీ షియల్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న రెవెన్యూ క్వార్టర్ భవనాలకు భూమిపూజను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించనున్న డీఆర్వో, ఆర్డీవో నివాస భవన సముదాయాలు అన్ని రకాల సదుపాయాలతో ఉండాలని సూచించారు. పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. కార్యక్ర మంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.