Share News

ఉద్యోగులకు శుభవార్త

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:33 AM

Government gives green signal for setting up PRC. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. పీఆర్సీ(వేతన సవరణ) అమలుకుగానూ కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. శనివారం అమరావతిలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికిగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగులకు శుభవార్త

  • పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

  • డీఏ, సరెండర్‌ లీవ్‌లకు కూడా..

  • ఉద్యోగ సంఘాల్లో హర్షం

  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు

  • శ్రీకాకుళం అర్బన్‌/ శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. పీఆర్సీ(వేతన సవరణ) అమలుకుగానూ కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. శనివారం అమరావతిలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికిగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ అమలుతోపాటు అక్టోబరు 1 నుంచి రెండు డీఏలు చెల్లించాలని, 2022 నాటి సరెండర్‌ లీవ్‌లు వచ్చే ఏడాది జనవరిలో ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో వేలాదిమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుందని ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళంలో ఎన్జీవో కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

  • ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ‘అక్టోబరు 1 నుంచి రెండు డీఏలు(2024జూలై1, 2025 జనవరి1), సరెండర్‌ లీవ్‌ల చెల్లింపునకు సీఎం అంగీకరించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అడిషినల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ను 2027 జనవరి నుంచి ఇవ్వడానికి ఆమోదం తెలపడం అభినందనీయమ’న్నారు.

  • ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘2022 కు సంబంధించిన సరెండర్‌లీవ్స్‌ను రానున్న సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పోలీసులకు ఒక అడిషనల్‌ సరెండర్‌లీవ్‌ను విజయదశమికి చెల్లిస్తారని చెప్పారు. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు 2027 జనవరి నుంచి అడిషినల్‌ క్వాంట్‌ం పెన్షన్‌ ఇవ్వడం, 70 ఏళ్లు దాటిన వారికి10శాతం, 75 సంవత్సరాలు దాటిన వారికి15శాతం చొప్పున అందించనున్నారని వెల్లడించారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌స్కీంకు బకాయిలను వచ్చేనెల నుంచి ఏనెలకు ఆ నెల ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌కు చెల్లించేందుకు అంగీకరించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎన్జీజీఓ జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాస్‌, కెజయరావు, బడగల పూర్ణచంద్రరావు,బొత్స శ్రీనివాసరావు బారకాల నవీన్‌,సబీనా బేగం పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:33 AM