Share News

రైతులకు శుభాలు కలగాలి: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:24 AM

పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులందరికీ సకల శుభాలు కలగాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆకాంక్షించారు. గురువారం ఉగాది సందర్భంగా స్వగ్రామం పెనుబర్తి, తోలాపి గ్రామాలలో రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు.

రైతులకు శుభాలు కలగాలి: ఎమ్మెల్యే రవికుమార్‌
రైతులతో కలసి పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌:

పొందూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులందరికీ సకల శుభాలు కలగాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆకాంక్షించారు. గురువారం ఉగాది సందర్భంగా స్వగ్రామం పెనుబర్తి, తోలాపి గ్రామాలలో రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటల వివరాలు తెలుసుకున్నారు. సాగునీటి సదుపాయంపై ఆరా తీశారు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ని కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.

Updated Date - Mar 20 , 2026 | 12:24 AM