పూండిలో బంగారం చోరీ
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:59 PM
పూండిలోని ఓ ఇంటిలో శనివారం దొంగతనం జరిగింది. సూట్ కేసులో ఉన్న మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదు చోరీకి గురయ్యాయి.
మూడుతులాల ఆభరణాలు.. రూ.15 వేల నగదు అపహరణ
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పూండిలోని ఓ ఇంటిలో శనివారం దొంగతనం జరిగింది. సూట్ కేసులో ఉన్న మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించి వజ్రపుకొత్తూరు పోలీసు హెడ్‌కానిస్టేబుల్ వైకుంఠరావు అందించిన వివరాలివీ... పూండి సాగర్ కాలనీలో భద్రాచలం రామకృష్ణ, భద్రాచలం మురళి అనే అన్నదమ్ములు ఒకే ఇంటిలో మేడ మీద, కింద కుటుంబాలతో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు ఇద్దరు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. శుక్రవారం రాఖీ పండగ కావడంతో రామకృష్ణ భార్య స్వాతి, మురళి భార్య బిందులు చినబడాంలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 9.30 గంటలకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ముడున్నర గంటలకు ఇంటికి చేరుకున్నారు. పైన ఉన్న స్వాతి ఇంటి తాళాలు తీసి ఉన్నాయి. బెడ్‌రూంలో బీరువా పక్కనే ఉన్న సూట్‌కేసులో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వజ్రపుకొత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ వైకుంఠరావు తెలిపారు. కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని, రూరల్ సీఐ తిరుపతిరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు.
చోరీపై అనుమానాలు
భద్రాచలం స్వాతి ఇంటిలో జరిగిన బంగారం, నగదు అపహరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఇంటిలోకి వెళ్లిన దా ఖలాలు లేవు. కేవలం పైన ఉన్న ఇంటికి వెళ్లారు. తలుపుల తాళాలు పగులగొట్టకుండా... తీసి ఉన్నాయి. బీరువాను తాకకుండా కే వలం సూట్ కేసులో ఉన్న బంగారం, నగదు దొంగతనం చేయడంపై పోలీ సులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూట్‌కేసులో బంగారం, నగదు ఉన్నట్లు దొంగకు ఎలా తెలిసింది అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.