Share News

బంగారం దుకాణాలు మూసివేత

ABN , Publish Date - May 19 , 2026 | 11:54 PM

ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం స్వర్ణ కారులు బంగారు దుకాణాలను మూసి వేసి నిరసన తెలిపారు.

బంగారం దుకాణాలు మూసివేత
నిరసన తెలుపుతున్న స్వర్ణకారులు

ప్రధాని ప్రకటనపై స్వర్ణకారుల నిరసన

అరసవల్లి, మే 19 (ఆంధ్ర జ్యోతి): ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం స్వర్ణ కారులు బంగారు దుకాణాలను మూసి వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కంచి కామాక్షిదేవి శ్రీకాకుళ పట్టణ స్వర్ణకార సేవా సంఘం అధ్యక్షుడు సోపింటి తారకేశ్వర రావు, కార్యదర్శి కడారి దుర్గా ప్రసాదాచారి మాట్లాడు తూ.. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో స్వర్ణకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా నగరం లోని చంపాగల్లి వీధిలోని బంగారు దుకాణాలను బంద్‌ పాటించినట్లు తెలిపారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులను పింఛన్లు ఇవ్వాలని, మున్సిపల్‌ పరిధిలో షాపులను నిర్మించి, తక్కువ అద్దెకు ఇవ్వాలని, కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో సంఘం కోశాధికారి తాళాబత్తుల సూర్యప్రకాష్‌, గౌరవా ధ్యక్షుడు ఎస్‌. శ్రీనివాసరావు, నేతలు అనుపోజు శ్రీధర్‌, ఈశ్వరరావు, చంద్రమౌళి, కనకరాజు, అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:54 PM