Share News

శుభలేఖలు పంచేందుకు వెళుతూ..

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:41 PM

శుభలేఖలు పంచేందుకు వెళుతూ కె.శాసనాం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ బడ్డి బాలరాజు (28) అలియాస్‌ బాలకృష్ణ మృతి చెందారు.

 శుభలేఖలు పంచేందుకు వెళుతూ..
ప్రమాద దృశ్యం

- రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

- మరో ఇద్దరి పరిస్థితి విషమం

- మృతుడికి 8 నెలల కిందటే వివాహం

- బొనొమాళిలో విషాదచాయలు

కంచిలి/ఇచ్ఛాపురం, మార్చి 8 (ఆంఽధ్రజ్యోతి): శుభలేఖలు పంచేందుకు వెళుతూ కె.శాసనాం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ బడ్డి బాలరాజు (28) అలియాస్‌ బాలకృష్ణ మృతి చెందారు. స్థానికులు, ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కంచిలి మండలం భొగాబెణి పంచాయతీ బొనొమాళి గ్రామానికి సర్వేష్‌ తన సోదరుని వివాహ ఆహ్వాన పత్రికలు ఒడిశా రాష్ట్రం జయంతిపురంలో ఉన్న బంధువులకు ఇచ్చేందుకు చిన్నాన్న కుమారుడైన బాలరాజుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఇచ్ఛాపురం మండలం కె.శాసనాం వద్ద ఇచ్ఛాపురానికి చెందిన రామ్‌శెట్టి దిలీప్‌ ఎదురుగా బైక్‌పై వచ్చి బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా సర్వేష్‌తో పాటు ఇచ్ఛాపురం నూకాలమ్మ ఆలయం వీధికి చెందిన రామ్‌శెట్టి దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తలకి తీవ్ర గాయమై బాలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన శ్యామల ఎలియాస్‌ శృతితో 8 నెలల కొందట వివాహమైంది. ఈయనకు తండ్రి దుర్యోధన, తల్లి పార్వతి ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదం లో సర్వేష్‌కు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లగా ఇచ్ఛాపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన దిలీప్‌ను బరంపురం తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. బాలరాజు మృతితో స్వగ్రామం బొనొమాళిలో విషాదఛాయలు అలముకు న్నాయి. బాలకృష్ణ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:42 PM