Share News

కూరగాయలు అమ్మకానికి వెళ్తూ..

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:22 AM

పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (75) ఆర్టీసీ బస్సు కిందపడి బుధవారం మృతి చెందింది.

కూరగాయలు అమ్మకానికి వెళ్తూ..

  • ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలి మృతి

సోంపేట, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (75) ఆర్టీసీ బస్సు కిందపడి బుధవారం మృతి చెందింది. పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. కుమారుడు బైరాగి వ్యవసా యం చేస్తూ కూరగాయలు పండిస్తుంటాడు. కొడుకు కి చేదోడుగా ఉండేందుకు పున్నాలు వీధుల్లో తిరుగు తూ కూరగాయలను అమ్ముతోంది. ఈ నేపథ్యంలో బు ధవారం కూడా కూరగాయలను అమ్మేందుకు మెయిన్‌ రోడ్డులో నడుచుకుంటూ వెళుతుండగా.. పెద్ద కోమటివీధి వద్ద బారువ నుంచి కంచిలి వైపు వస్తున్న ఆర్టీసీ ఢీకొంది. దీంతో బస్సు చక్రం కిందపడిన పున్నాలు అక్కడికక్కడే మృతి చెందింది. పున్నాలుకు కుమారుడితోపాటు కుమార్తె ఉంది. కుమారుడు బైరాగి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహిని కేసు నమోదు చేశారు.

సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డు ఏఎస్‌ఐ ఆత్మహత్య

పలాస, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రైలుకింద పడి నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డు ఏఎస్‌ఐ బగాది హిమంతరావు (65) ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి బెండిగేట్‌ సమీపంలో గుర్తుతెలియని రైలుకింద పడి ఈ అఘా యిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కు టుంబీకులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. హిమంతరావుకు భార్య ఝాన్సీ, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

పలాస, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుడు రంగన్న(75) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలి పారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు అనారోగ్యం తో రెండు రోజుల కిందట ఆసుపత్రిలో చికిత్స కోసం రంగన్న చేరాడు. ఆయన ఒడిశా రాష్ట్రం గురండి గ్రా మానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వృద్ధుడి వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 12:22 AM