Share News

దైవ దర్శనానికి వెళ్లివస్తూ..

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:31 AM

గార మండలం వత్సవలస గ్రామంలో రాజులమ్మతల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.రమేష్‌ (32) దుర్మరణం చెందగా భార్య సుజాత, కుమార్తె ధాత్రిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి.

దైవ దర్శనానికి వెళ్లివస్తూ..

  • బుడుమూరు వద్ద రోడ్డు ప్రమాదం

  • ఒకరి దుర్మరణం

  • ఇద్దరికి తీవ్రగాయాలు

లావేరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గార మండలం వత్సవలస గ్రామంలో రాజులమ్మతల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.రమేష్‌ (32) దుర్మరణం చెందగా భార్య సుజాత, కుమార్తె ధాత్రిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా దాకమర్రి గ్రామానికి చెందిన రమేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి వత్సవలస రాజులమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగుప్రయా ణంలో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బుడుమూరు వద్ద టెక్కలి నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సుజాత, ధాత్రిశ్రీలను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించా రు. రమేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు లావేరు ఎస్‌ఐ కేఏ సూరి తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 12:31 AM