ఇతర రాష్ట్రాలకు వెళ్లి పింఛన్ల అందజేత
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:09 AM
ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఇత ర రాష్ట్రాల్లో ఉంటున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందజేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై కంబాలరాయుడిపేట సచివాలయ సిబ్బందికి శుక్రవారం మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు తెలిపారు.
కంబాలరాయుడిపేట సచివాలయ సిబ్బందికి మెమోలు
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఇత ర రాష్ట్రాల్లో ఉంటున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందజేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై కంబాలరాయుడిపేట సచివాలయ సిబ్బందికి శుక్రవారం మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కంబారాయుడుపేటకు చెందిన కొంతమంది పింఛన్ ల బ్ధిదారులు పనుల కోసం పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి తీసు కొనే సదుపాయం కల్పించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కంబారాయు డుపేట గ్రామానికి చెందిన లబ్ధిదారుల వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారని, ఇందుకోసం కొంత మొత్తాన్ని సిబ్బంది తీసుకుంటు న్నారని గ్రామానికి చెందిన కొంతమంది ఎంపీడీవోకు రెండు రోజుల కిందట లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇచ్చే అధికారం సచివాలయ సిబ్బందికి లేదని, దీనిపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.