విధి నిర్వహణకు వెళుతూ...
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:38 PM
తమ్మినాయుడుపేట పంచాయతీ సనపల వానిపేట వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఎచ్చెర్ల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తమ్మినాయుడుపేట పంచాయతీ సనపల వానిపేట వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం మురపాక పంచాయతీ నాజానపేట గ్రామానికి చెందిన జగ్గురోతు రామారావు(40) సనపలవానిపేటలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం వాటర్ ప్లాంట్‌కు వెళ్లేందుకు మోటారు సైకిల్‌పై గ్రామం నుంచి సర్వీసు రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో కుశాలపురం నుంచి తమ్మినాయుడుపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ బలంగా అతన్ని ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన రామారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.