Share News

‘సురక్షిత డ్రైవింగ్‌ లక్ష్యం’

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:42 PM

డ్రైవింగ్‌ చేసే సమయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటిం చాలని, సురక్షిత డ్రైవింగ్‌ లక్ష్యంగా పనిచేయాలని ప్రాంతీయ రవాణాధికారి అనిల్‌, ట్రాఫిక్‌ సీఐ రామా రావు అన్నారు.

‘సురక్షిత డ్రైవింగ్‌ లక్ష్యం’
మాట్లాడుతున్న ఆర్టీసీ అధికారి

అరసవల్లి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్‌ చేసే సమయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటిం చాలని, సురక్షిత డ్రైవింగ్‌ లక్ష్యంగా పనిచేయాలని ప్రాంతీయ రవాణాధికారి అనిల్‌, ట్రాఫిక్‌ సీఐ రామా రావు అన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకా కుళం ఒకటో డిపోలో మంగళవారం డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమా దాలను నివారించడం, సురక్షిత డ్రైవింగ్‌ మెరుగు పరచడం ధ్యేయంగా పనిచేయాలన్నారు. డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లను వాడవ ద్దన్నారు. ముఖ్య కూడళ్లు, స్పీడ్‌ బ్రేకర్ల వద్ద, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికుల భద్రత తదితర అంశాలపై అవ గాహన కల్పిం చారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, శర్మ, జిల్లాలోని నాలుగు డిపోల నుంచి డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:42 PM