Share News

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:14 AM

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం: ఎస్పీ
ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 61 వినతులను ఎస్పీ స్వీకరించి, బాధితులతో స్వయంగా మా ట్లాడి సమస్యలను తెలుసుకు న్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చి న ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీ లించి సత్వ రం చట్టపరంగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాద న్నారు. పూర్వీకుల నుంచి దఖలు పడిన భూమిని తన తమ్ములు నారాయణరావు, గణేష్‌ కుటుంబ సభ్యులు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని ఎచ్చెర్ల మండలం ఏబీ ఎన్‌పేటకి చెందిన అలపాన సోములు ఎస్పీని కోరారు. దీనిపై ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళితే తిరిగి తనపైనే కేసు పెట్టి వేధిస్తున్నారని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. న్యాయం చేయాలని స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఎచ్చెర్ల ఎస్‌ఐ బెదిరి స్తున్నారని బాధితుడు ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు.

Updated Date - Jun 30 , 2026 | 12:15 AM