Share News

ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:50 PM

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిం చడమే అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌-2025 లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
: క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, జూలై 21(ఆంద్రజ్యోతి): గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిం చడమే అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌-2025 లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. కొరసవాడ జడ్‌పీ హెచ్‌ఎస్‌లో అమరావతి చాంపియన్‌షిప్‌ కప్‌-2026 క్రీడాపోటీలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలన్నదే రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ లక్ష్యమని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ధృఢత్వం సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. క్రీడల రాష్ట్రబాధ్యులు ఎన్ని శేఖర్‌బాబు మాట్లాడుతూ శాప్‌ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, యోగా, అథ్లెటిక్స్‌, చదరంగం తదితర పోటీల నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడల నియోజకవర్గ బాధ్యుడు జన్ని కృష్ణ, మండల బాధ్యుడు శిమ్మ కృష్ణ, రాజారావు పాల్గొన్నారు.

విద్యార్థుల సంక్షేమంపై దృష్టి

విద్యార్థుల సంక్షేమంపై మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర సమీకృత వసతి గృహంలో వసతి సామగ్రిని మంగళవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సౌకర్యాలు కల్పన, ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:50 PM