Share News

జీవో-36 అమలు చేయాలిz

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:49 PM

అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని పీఏసీఎస్‌ ఉద్యోగులు తెలిపారు. మంగళవారం స్థానిక పీఏసీఎస్‌ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ కూడా సమ్మెను కొనసాగించారు.

జీవో-36 అమలు చేయాలిz
మేనేజర్‌కు వినతప త్రం అందజేస్తున్న పీఏసీఎస్‌ ఉద్యోగులు

పలాస రూరల్‌,ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని పీఏసీఎస్‌ ఉద్యోగులు తెలిపారు. మంగళవారం స్థానిక పీఏసీఎస్‌ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ కూడా సమ్మెను కొనసాగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో-36ను వెంటనే అమలుచేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అమలుచేయాలని, పీఏసీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలు అమలుచేయాలని, ఉద్యోగికి ఆరోగ్యబీమా, ఇన్సూరెన్స్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. అనంతరం సమస్యలపై వినతిపత్రాన్ని పలాస బ్రాంచ్‌ మేనేజర్‌ ఎ.తులసీ బాయికి అందజేశారు. కార్యక్రమంలో పలాస పీపీసీఎస్‌ ఉద్యోగులు సీఇవో శ్రీనివాసరా వు, జగదీశ్వరరావు, శ్రీను, విజయకుమార్‌, నందిని, బోనుబెహరా పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:49 PM