Share News

ఉపాధి కోసం వెళ్లి...

ABN , Publish Date - May 25 , 2026 | 12:08 AM

స్థానిక ఆర్‌.మరువాడకు చెందిన పాల ఈశ్వరరావు దుబాయ్‌లో అదృశ్యమైనట్టు ఆయన భార్య భారతి తెలిపారు.

ఉపాధి కోసం వెళ్లి...
ఈశ్వరరావు (ఫైల్‌)

-దుబాయ్‌లో మరువాడ వాసి అదృశ్యం

సంతబొమ్మాళి, మే 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్‌.మరువాడకు చెందిన పాల ఈశ్వరరావు దుబాయ్‌లో అదృశ్యమైనట్టు ఆయన భార్య భారతి తెలిపారు. భార్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ఈశ్వరరావు ఈనెల 15న హైదరాబాద్‌ నుం చి దుబాయ్‌కి కూలీ పనుల కోసం ఏజెంటు ద్వారా వెళ్లాడు. 16న మెడికల్‌కు ఏజెంట్‌ ద్వారా వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ మరుసటి రోజు నుంచి ఫోన్‌ చేస్తుంటే అరబ్‌లో మాట్లాడి పేట్టేశారు. ఆ తరువాత రోజు నుంచి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. దీంతో ఈశ్వరరావు సమాచారం తెలియక కుటుంబ సభ్యులు అందోళన చెందుతున్నారు. ఈశ్వరరావుకు భార్య భారతితో పాటు కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుల దృష్టికి సమస్యను తీసుకెళ్లగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 12:08 AM