Share News

జీవో- 396 ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:47 PM

జీవో- 396 ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దస్తావేజు లేఖర్లు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు.

 జీవో- 396 ఉపసంహరించుకోవాలి
టెక్కలి: నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్లు :

జీవో- 396 ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దస్తావేజు లేఖర్లు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు.

ఫ టెక్కలి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జారీచేసిన జీవో- 396 ఉప సంహరించుకోవాలని సోమవారం టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో గల దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్‌ చేపట్టారు. ఈమేరకు ఈనెల 31 వరకు నిరవధికం గా పెన్‌డౌన్‌ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో రామారావు, లవకుమార్‌, శివప్రసా ద్‌, నానీ, మురళీమోహన్‌, దినేష్‌ పాల్గొన్నారు.

ఫ కోటబొమ్మాళి, జూలై 20(ఆంధ్రజ్యోతి):రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ల శాఖను ప్రైవేటీక రించాలని ప్రభుత్వం జారీచేసిన జీవో- 396ను ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్‌చేశారు. ఈ మేరకు దస్తావేజులేఖరుల సంఘం ఆధ్వర్యంలో కోటబొమ్మాళి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి దస్తావేజు లేఖర్లు పట్నాయకుని భాస్కరరావు, శిరసాన శ్రీనివాస్‌, రొక్కం జయంత్‌కుమార్‌, ఉర్లాం లక్ష్మణ్‌, సిబ్బంది జామి కామేశ్వరరావు, నౌపడ మురళి నిరసన తెలిపారు.

ఫనరసన్నపేట, జూలై20(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు తమ సమస్యలను పరిష్కారించాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో డాక్యుమెంట్‌ రైటర్ల సంఘ నాయకులు బెహరా దుర్గాప్రసాద్‌, డి.నీలాద్రి, జల్లు సూరిబాబు, తోట రామారావు, పూజారి మోహనరావు, సిరిసెల్లి వైకుంఠరావు, నల్లబాటి వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:47 PM