Share News

వైభవంగా హీరాపంచమి

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:49 PM

జగన్నాథ రథయాత్ర సందర్భంగా పట్టణంలోని గడించా మందిరం వద్ద, కంచిలి మండలం కొల్లూరులో సోమవారం హీరాపంచమి ఉత్సవం వైభవంగా నిర్వహిం చారు.

వైభవంగా హీరాపంచమి
ఇచ్ఛాపురం: ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు

ఇచ్ఛాపురం/కంచిలి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జగన్నాథ రథయాత్ర సందర్భంగా పట్టణంలోని గడించా మందిరం వద్ద, కంచిలి మండలం కొల్లూరులో సోమవారం హీరాపంచమి ఉత్సవం వైభవంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్నాఽథుడు వామనావతారంలో, బలరాముడు నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. యాత్ర ప్రారంభమైన ఐదోరోజున హీరా పంచమి ఉత్సవం జరపడం ఆనవాయితీ. ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం లక్ష్మీ నారాయణ సంవాద ఘట్టం విశేషంగా ఆకట్టుకుంది. తనను విడిచి పెట్టి వచ్చేసిన జగన్నాథుని వెతుక్కుంటూ లక్ష్మీ దేవి గుడించా మందిరానికి రాగా జగన్నాథుడు తలుపు వేసిన సందర్భంలో ఇద్దరి మధ్య జరిగే సంవాద ఘట్టాన్ని ఇరువైపులా అర్చకులు నిర్వ హించారు. పలు అవతారాల్లో స్వామి దర్శనమిచ్చారు.

Updated Date - Jul 20 , 2026 | 11:50 PM