ప్రాణం పోసి.. ప్రాణం వదిలి..
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:08 AM
పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (24) వెదుళ్లవలస గ్రామానికి చెందిన భర్త వజ్రగడ్డి సుధీర్‌తో 2023లో ప్రేమ వివాహం చేసుకుంది.
ఆమదాలవలస, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (24) వెదుళ్లవలస గ్రామానికి చెందిన భర్త వజ్రగడ్డి సుధీర్‌తో 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. వేధింపులతో మనస్పర్థలు ఏర్పడి కన్నవారింటికి వచ్చింది. అప్పటికే ఈమె గర్భవతి. అయితే భర్తతో వివాదాల నేపథ్యంలో ఈనెల 17న ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అపర్ణను వెంటనే కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె పాపకు జన్మనిచ్చింది. వారం రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. చిన్నారి మాత్రం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి గోపి 17న అదనపు కట్నం కోసం వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పు డు అపర్ణ మృతి చెందిన నేపథ్యంలో బుధవారం కేసులో మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రాణాపాయ స్థితిలో అపర్ణకు జన్మనిచ్చిన చిన్నారి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు.