పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:59 PM
విద్యార్థులు పుస్తక పఠ నానికి ప్రాధాన్యత నివ్వాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం వీసీ కేఆర్‌రజని చెప్పారు. పుస్తకాలు చదవడంతోనే విజ్ఞానం సాధ్యమని తెలిపారు.
ఎచ్చెర్ల రూరల్, నవంబరు20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పుస్తక పఠ నానికి ప్రాధాన్యత నివ్వాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం వీసీ కేఆర్‌రజని చెప్పారు. పుస్తకాలు చదవడంతోనే విజ్ఞానం సాధ్యమని తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం లైబ్రరిలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరీ పరిశీలించిన వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం లైబ్రరీలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలు, అక డమిక్, కరెంట్ ఎఫైర్స్‌కు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచ నున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, లైబ్రరీ సైన్స్ కోఆర్డినేటర్ గోవిం దరాజులు పాల్గొన్నారు.