Share News

ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా గిరిధర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:12 AM

Giridhar assumes responsibilities రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ (ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ గిరిధర్‌ మద్రాసు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా గిరిధర్‌ బాధ్యతల స్వీకరణ
ప్రొఫెసర్‌ గిరిధర్‌ను సత్కరిస్తున్న ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అమరేంద్రకుమార్‌

ఎచ్చెర్ల, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ (ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ గిరిధర్‌ మద్రాసు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్జీయూకేటీ పరిధిలోని క్యాంపస్‌ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఐఐటీ ప్రొఫెసర్లను వీసీలుగా, డైరెక్టర్లుగా ఇటీవల నియమించింది. ఇందులో భాగంగా ఐఐటీ, హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ గిరిధర్‌ను శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఈయన గతంలో జేసీ బోస్‌ నేషనల్‌ ఫెలోషిప్‌(2015-20) అందుకున్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌(2015-19) ప్రకారం కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ప్రపంచంలోని 100 మంది శాస్త్రవేత్తలో ఈయన ఒకరుగా గుర్తింపు పొందారు. ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారాన్ని(2009)లో అందుకున్నారు. తాజాగా ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సండ్ర అమరేంద్రకుమార్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో క్యాంపస్‌ పరిపాలనాధికారి డాక్టర్‌ ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ డాక్టర్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వాసు, క్యాంపస్‌-2 ఇన్‌చార్జి సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:12 AM