Share News

ఘరానా దొంగ అరెస్టు

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:43 PM

Ten two-wheelers, eight grams of gold seized ఒడిశా కి చెందిన వారిద్దరూ పాత నేరస్థులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాలు, బంగారం ఆభరణాలు చోరీ చేసేవారు. కాగా.. శనివారం టెక్కలి పోలీసులకు ఒకరు పట్టుబడగా.. మరొకరు రిమాండ్‌లో ఉన్నట్టు తేలింది.

ఘరానా దొంగ అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ లక్ష్మణరావు, పోలీసుల అదుపులో నిందితుడు

- పది ద్విచక్రవాహనాలు, ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం

- రిమాండ్‌లో మరో నిందితుడు

టెక్కలి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఒడిశాకి చెందిన వారిద్దరూ పాత నేరస్థులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాలు, బంగారం ఆభరణాలు చోరీ చేసేవారు. కాగా.. శనివారం టెక్కలి పోలీసులకు ఒకరు పట్టుబడగా.. మరొకరు రిమాండ్‌లో ఉన్నట్టు తేలింది. టెక్కలి డీఎస్పీ భాస్కరరావు స్థానిక పోలీసుస్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ‘టెక్కలి జాతీయరహదారి లచ్చన్నపేట సమీపంలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశా రాష్ట్రం అస్కాబ్లాక్‌ గంజాం జిల్లా కలసందపూర్‌ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మేకల గణేష్‌ పట్టుబడ్డాడు. ఆయనను విచారణ చేయగా.. గతంలో అదేప్రాంతానికి చెందిన రావుల వినోద్‌తో కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు బయటపడింది. వారిద్దరూ టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, మందస ప్రాంతాల్లో పది ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. వీటితోపాటు నందిగాం పోలీస్‌స్టేషన్‌లో గతేడాది కైమ్‌నెం.33కు చెందిన ఎనిమిది గ్రాముల బంగారం గొలుసును విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గణేష్‌ను అదుపులోకి తీసుకుని.. వాహనాలు, బంగారం ఆభరణం స్వాధీనం చేసుకున్నాం. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామ’ని డీఎస్పీ భాస్కరరావు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు రావుల వినోద్‌ను ఎచ్చెర్ల పోలీసులు ఒక కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. వాహనదారులు సురక్షిత ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయాలని, తాళాలు వేసి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో సీఐ విజయ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:43 PM