Share News

ఉత్తమ ఆసుపత్రిగా జీజీహెచ్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:07 AM

Medical equipment worth ₹4.52 crore for RIMS శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)ను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా, రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సీఎస్‌ఆర్‌ నిధులు రూ.4.52 కోట్లతో సమకూర్చిన 72 వైద్య పరికరాలను, రిమ్స్‌లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు.

ఉత్తమ ఆసుపత్రిగా జీజీహెచ్‌
జీజీహెచ్‌లో పరికరాలు పరిశీలిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.. పక్కన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యే శంకర్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

రిమ్స్‌కు రూ.4.52 కోట్ల వైద్య పరికరాలు

ఐఓసీ సీఎస్‌ఆర్‌ నిధులతో అందజేత

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)ను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా, రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సీఎస్‌ఆర్‌ నిధులు రూ.4.52 కోట్లతో సమకూర్చిన 72 వైద్య పరికరాలను, రిమ్స్‌లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. కొత్త పరికరాలతో పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. రిమ్స్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య పరికరాలను పరిశీలించిన అనంతరం రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. కొత్తగా సమకూర్చిన పరికరాల్లో కొన్ని రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో లేవన్నారు. వీటితో రక్త పరీక్షలు, శస్త్రచికిత్సలు వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. చిన్న కారణాలతో విలువైన పరికరాలను మూలనపడేయకుండా, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. రెండు నెలల తర్వాత పరికరాల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. గతంలో సరైన పరికరాలు లేని జీజీహెచ్‌లో ఆధునిక సౌకర్యాలు సమకూరడం సంతోషకరమన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ఆధునిక పరికరాలను సమకూర్చుకోవడం ఒక ఎత్తయితే, వాటిని సక్రమంగా నిర్వహించడం మరో ఎత్తన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ జేడీ రాజశేఖరరెడ్డి, సూపరింటెండెంట్‌ సౌమిని, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పలనాయుడు, ఐఓసీ ప్రతినిధి పీయూష్‌ మిట్టల్‌, నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి మయూర్‌ పట్నాల, మామిడి గోవిందరావు, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:07 AM