స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:47 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం రణస్థలంలో ఎచ్చె ర్ల టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం పార్లమెం టరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్య క్షతన జరిగింది.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రణస్థలం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం రణస్థలంలో ఎచ్చె ర్ల టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం పార్లమెం టరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్య క్షతన జరిగింది. ఈ సమావేశానికి మం త్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, పరిశీలకుడు రాధాకృష్ణతో పాటు ఎచ్చెర్ల నియోజక వర్గంలోని నాలుగు మండ లాల నుంచి టీడీపీ నాయకులు హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని, తన కుటుంబానికి ఎచ్చెర్లతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లా డుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నిలబెడదా మన్నారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, సీనియర్ నేత చౌదరి బాబ్జీ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, లంక శ్యామ లరావు, బెండు మల్లేశ్వర రావు, కొమరాపు రవి, డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాఽథం నాయుడు, పిన్నింటి భానోజీ నాయుడు, లంక ప్రభ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
రణస్థలం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సమస్యలు తెలుసుకొని వాటిన సత్వరమే పరిష్కరించేం దుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాల యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వచ్చిన అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, కూటమి నాయకులు లంక శ్యామల రావు, బెండు మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.