స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: ఎమ్మెల్యే అశోక్
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:35 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, గెలుపే లక్ష్యంగా పనిచే యాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు.
ఇచ్ఛాపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, గెలుపే లక్ష్యంగా పనిచే యాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సురంగి రాజా మైదానం ఎదురుగా రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ శంకర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, ఎల్. పద్మనాభం, ఎన్.కోటి, డి.కామేష్, ఏఎంసీ చైర్మన్ మణి చంద్ర ప్రకాష్, పీఏసీఎస్ అధ్యక్షుడు పెదిని బాబ్జీపాల్గొన్నారు.