గ్యాస్‌ట్యాంకర్ లీకేజీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:26 AM
Goods stopped at Tilaru station విశాఖపట్నం నుంచి భువనే శ్వర్ వెళ్తున్న గూడ్స్ గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. హెచ్‌పీసీఎల్ గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు 16వ ట్యాంకర్ పైకప్పు మాస్టర్ వీల్ లీకై గ్యాస్ వాసన రావడంతో ఉర్లాం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు గమనించారు.
తిలారు స్టేషన్‌లో గూడ్స్ నిలుపుదల
అప్రమత్తమైన అధికారులు
గంటల తరబడి నిలిచిన రాకపోకలు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
జలుమూరు/ కోటబొమ్మాళి/ ఆమదాలవలస, మార్చి 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి భువనే శ్వర్ వెళ్తున్న గూడ్స్ గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. హెచ్‌పీసీఎల్ గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు 16వ ట్యాంకర్ పైకప్పు మాస్టర్ వీల్ లీకై గ్యాస్ వాసన రావడంతో ఉర్లాం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు గమనించారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చా రు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమ యంలో తిలారు రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ను రైల్వే అధికా రులు నిలిపేశారు. రైల్వే ఉన్నతాధికారులకు, పోలీసుల కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెం టనే వారంతా రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ నిపుణులు విశాఖపట్నం నుం చి వచ్చి లీకేజీకి గల కారణాలను పరిశీలించారు. గ్యాస్ లీకవుతున్న ట్యాంకర్‌ను గూడ్స్ నుంచి విడదీ శారు. గ్యాస్‌లీక్ కాకుండా.. ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ముందస్తుగా రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణి కులను బయటకు పంపేశారు. రైల్వేలైన్‌కు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపేశారు. గ్యాస్‌లీకేజీని అరికట్టారు.
ఈ ఘటనతో విశాఖ, పలాస తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సుమారు నాలుగు గంటలకుపైగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హౌరా-చెన్నై మధ్య నడిచే రైళ్లు విశాఖపట్నం, ఇచ్ఛాపురం మధ్య నిలిపేశారు. దీంతో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో పలు గూడ్స్ రైళ్లతోపాటు విశాఖపట్నం, భువనేశ్వర్, వందేభారత్ రైళ్లు సుమారు రెండు గంటలపాటు రెండో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై నిలిచిపోయాయి. ముంబై, భువనేశ్వర్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను పొందూరు రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించి ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ పలాస వైపు నుంచి విశాఖట్నం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ముంబై, హౌరా, భువనేశ్వర్, బ్రహ్మపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు సకాలంలో రాక ప్రయాణికులు నిరీక్షించారు. శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, టెక్కలి డిఎస్పీ లక్ష్మణరావు, తహసీల్దారు రామారావు, నరసన్నపేట, సీఐ శ్రీనివాసరావు, జలుమూరు ఎస్‌ఐ అశోక్‌బాబు, అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీనుబాబు, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి హెచ్‌పీ గ్యాస్ టెక్నీషియన్స్ వచ్చి లీకేజీ పరిశీలించి.. అనుమతిచ్చిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో గూడ్స్ రైలు కదిలింది. మిగిలిన స్టేషన్లలో కూడా రైళ్లు కదలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.