గ్యాస్ కష్టాలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:43 AM
వినియోగదారులకు వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.
- సిలిండర్ల కోసం బారులు
పొందూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మండల కేంద్రంలోని గ్యాస్ ఏజన్సీ గోడౌన్ వద్ద వందలాది మంది గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వినియోగదారులు గ్యాస్ కోసం పోటీ పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసే ఆన్‌లైన్ నెంబరు మూడు రోజులుగా పని చేయకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోయింది. సిలిండర్లతో ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు.