Share News

రంగోయిలో గ్యాస్‌లీకేజీ.. మంటలు వ్యాప్తి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:16 AM

పలాస మండ లం రంగోయి గ్రామంలో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి దుకాణా ల్లోని సామగ్రి కాలి బూడిదైన ఘటన సోమవారం చోటుచేసు కుంది.

రంగోయిలో గ్యాస్‌లీకేజీ.. మంటలు వ్యాప్తి
కాలిపోతున్న దుకాణం

  • మూడు షాపులు దగ్ధం

పలాస రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పలాస మండ లం రంగోయి గ్రామంలో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి దుకాణా ల్లోని సామగ్రి కాలి బూడిదైన ఘటన సోమవారం చోటుచేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. రం గోయి గ్రామంలో రెయ్యి రామా రావుకు చెందిన చికెన్‌షాపులో ఏర్పాటు చేసిన గ్యాస్‌ సిలిండర్‌ సోమవారం లీకై ఒక్కసారిగా మంటలు చలరేగా యి. దీంతో పక్కనే ఉన్న సెలూన్‌, బైక్‌ మెకానిక్‌ షాపులకు మంటలు వ్యాపించా యి. ఈ క్రమంలో షాపుల్లో ఉన్న విద్యుత్‌ మీటర్లు, యంత్రాలు, సామగ్రి, చికెన్‌ షాప్‌లో చికెన్‌ డ్రెస్సింగ్‌ మెషిన్‌, ఎలకా్ట్రనిక్‌ కాటా, మీటరు, రెండు ఎలక్ర్టికల్‌ స్టౌ వ్‌లు ఇతర సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చే సరికే జర గాల్సిన నష్టం జరిగిపోయింది. గ్యాస్‌ లీక్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కాశీబుగ్గ ఫైర్‌స్టేషన్‌ ఎస్‌ఐ సోమేశ్వరరావు తెలిపారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉండగా, దీనిపై కేసు నమోదు చేసి ఫైర్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:17 AM