Share News

నిబంధనల మేరకు గ్యాస్‌ పంపిణీ: డీఎస్‌వో

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:12 AM

నిబంధనల మేరకు ఎల్‌పీజీ గ్యాస్‌ పంపిణీ చేస్తున్నామని జిల్లా సివిల్‌సప్లయ్‌శాఖ అధికారి జి.సూర్యప్రకాష్‌రావు తెలిపారు.

నిబంధనల మేరకు గ్యాస్‌ పంపిణీ: డీఎస్‌వో
నరసన్నపేటలో హాటల్స్‌లో అక్రమంగా వాడుతున్న డొమెస్టిక్‌ సిలిండర్లను పట్టుకున్న డీఎస్‌వో సూర్యప్రకాష్‌రావు

నరసన్నపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): నిబంధనల మేరకు ఎల్‌పీజీ గ్యాస్‌ పంపిణీ చేస్తున్నామని జిల్లా సివిల్‌సప్లయ్‌శాఖ అధికారి జి.సూర్యప్రకాష్‌రావు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే ఏజెన్సీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నరసన్నపేటలో హాటళ్లు, దాబాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హాటళ్లలో డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదుచేసి ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వసతిగృహాలను పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగించవద్దని, వసతిగృహాలకు పంపిణీ చేసే గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని కోరారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:12 AM